Monday, December 23, 2024

‘కల్కి’ ఓ కొత్త ప్రపంచం

- Advertisement -
- Advertisement -

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 ఎడి’. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్‌లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ముంబైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో కల్కి టీంతో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘కల్కి 2898ఎడి’లో పార్ట్ అవ్వడం గొప్ప గౌరవం. ఇది ఓ కొత్త ప్రపంచం. ఇలాంటి సినిమా గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి సినిమాని అలోచించిన నాగ్ అశ్విన్, టీం అందరికీ అభినందనలు’ అని అన్నారు. ఉలగ నాయగన్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘నాగ్ అశ్విన్ మా గురువు బాలచందర్‌లా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్.

తన ఐడియాని అద్భుతంగా చూపించే నేర్పు నాగ్ అశ్విన్‌కి వుంది. ఇందులో బ్యాడ్ మ్యాన్‌గా ప్లే చేస్తా’ అని తెలిపారు. రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. ‘గ్రేటెస్ట్ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో పనిచేసే అవకాశం ఇచ్చిన అశ్వి ని దత్తు, నాగ్ అశ్విన్‌కు దన్యవాదాలు దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్’ అని పేర్కొన్నారు. నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. హీరోయిన్ దీపికా పదుకొణె మాట్లాడుతూ.. కల్కి పూర్తిగా న్యూ వరల్డ్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది. అతను సినిమాని అద్భుతంగా తీశారు’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News