Saturday, January 18, 2025

జపాన్‌లో విడుదల కానున్న ‘కల్కి 2898 ఎడి’

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ మాసివ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 ఎడి’ జనవరి 3, 2025న జపాన్‌లో షోగాట్సు ఫెస్టివల్‌కి విడుదల కానుంది. పరిశ్రమ దిగ్గజం కబాటా కైజో ఆధ్వర్యంలో ట్విన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్న ఈ సినిమా గ్లోబల్ జర్నీలో మరో అధ్యాయాన్ని నాంది పలుకుతోంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన ’కల్కి 2898 ఎడి‘ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా, హిందీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. నేషనల్ అవార్డ్ విన్నర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రభాస్ జపనీస్ ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ పొందారు, వీరిలో చాలా మంది ఈ చిత్రాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇండియాకి వచ్చారు. ప్రభాస్ జపనీస్ ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ పొందారు. వీరిలో చాలా మంది ఈ చిత్రాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇండియాకి వచ్చారు.

రెబల్ స్టార్ నట జైత్రయాత్రకు 22 ఏళ్లు..

తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన నట ప్రస్థానం 22 ఏళ్లకు చేరుకుంది. 2002, నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్‘ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించి ప్రభాస్ అప్రతిహత నట ప్రస్థానానికి పునాది వేసింది. రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి వరకు ప్రభాస్ ప్రయాణం ఒక దశ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ ప్రారంభమైంది.

బాహుబలి రెండు చిత్రాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుంటున్నాడు. ప్రభాస్ రెండు సార్లు (బాహుబలి 2, కల్కి 2898 ఎడి) వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను ఖాతాలో వేసుకోవడం ఒక అరుదైన రికార్డు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ది రాజా సాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా… ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌లు. వీటితో పాటు హోంబలే ఫిలింస్ మరో రెండు చిత్రాలను ప్రభాస్ తో నిర్మించనున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News