Saturday, January 18, 2025

వావ్.. అదరగొట్టిన ‘కల్కి 2898 ఎడి’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 ఎడి’. మాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ చివరికి విడుదలైంది. ’కల్కి 2898 ఎడి’ సినిమాటిక్ యూనివర్స్‌ని ఎక్స్ ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్‌లోకి తీసుకెళ్ళింది. టాప్ క్లాస్ సైన్స్ ఫిక్షన్, ఎఎఫ్‌ఎక్స్‌తో అత్యద్భుతం అనిపించింది. సినిమా ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్‌తో సహా పలు భాషల్లో చూడటానికి అందుబాటులో ఉంది. ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్‌లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్‌ని చూపించి అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు.

ఉలగనాయగన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్నారు. ఆసక్తిని మరింతగా పెంచుతూ ఫ్యూచర్ వెహికల్, బెస్ట్ ఫ్రెండ్ ’బుజ్జి’తో ప్రభాస్ తన పవర్-ప్యాక్డ్ యాక్షన్, కెమిస్ట్రీతో అదరగొట్టారు. దీపికా పదుకొనే ప్రతి ఫ్రేమ్‌లో ఎమోషన్స్‌తో నెరేటివ్‌కి డెత్‌ని జోడిస్తుంది. దిశా పటాని తన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ “ఒక ఫిల్మ్ మేకర్స్ గా ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ పట్ల నాకు చాలా పాషన్. ’కల్కి 2898 ఎడి’లో ఈ రెండు ఎలిమెంట్స్‌ని మిళితం చేయడం మా ఆర్టిస్ట్ లు, టీం అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది. ఈ కలని సాకారం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది.

ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని మరింత ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తుందని మేము ఆశిస్తున్నాము”అని అన్నారు. ’కల్కి 2898 ఎడి’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News