Friday, December 20, 2024

కల్కి అప్డేట్: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ అభిమానులకు ‘కల్కి 2898 ఏడి’ మూవీ నిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పేశారు. ఈ సందర్భంగా కల్కి కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో మూవీపై అంచనాలు పెంచేలా ప్రభాస్ లుక్ ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా టీజర్ ను కూడా రిలీజ్ చేసే ఉద్దేశంలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

వారం రోజులుగా కల్కి మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్నే నిర్మాతలు కూడా కన్ఫర్మ్ చేయడం విశేషం. మే 9న మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వైజయంతీ బానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు. విశ్వ నటుడు కమల్ హాసన్ ఈ మూవీలో విలన్ పాత్ర పోషిస్తూండటం మరొక విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News