Tuesday, January 21, 2025

కల్కి సినిమా తొలి రోజు బుకింగే అదరహో !!!

- Advertisement -
- Advertisement -

దర్శకుడు నాగ్ అశ్విన్ బ్రహ్మాండమైన చిత్రం ‘కల్కి 2898 AD’ జూన్ 27న విడుదల కాబోతున్నది. అయితే అడ్వాన్స్ బుకింగ్ లు ఊహించనంత ఊపందుకున్నాయి. దాదాపు 210 ఐమ్యాక్స్ స్క్రీన్ల పై విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ఇది. విశేషం ఏమిటంటే 2డి, 3డి వర్షన్లలో హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో కూడా విడుదల అవుతోంది.

తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ గా 2.8 లక్షల టికెట్లకు పైగా అమ్ముడయ్యాయి. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం తొలి రోజే అడ్వాన్స్ బుకింగ్ లతో రూ. 8.2 కోట్లకు పైగా ఆర్జించింది. సాక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం బాహుబలి2, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత వరల్డ్ వైడ్ బాక్సాఫీస్  వద్ద జూన్ 27 రూ. 200 కోట్లు ఆర్జించబోతున్న మూడో చిత్రం కల్కి.

ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఈ సినిమా రూ. 90 నుంచి 100 కోట్ల ఓపెనింగ్ సాధించగలదని అంచనా. ఉత్తర భారత దేశంలో ఓపెనింగ్ రోజున రూ. 20 కోట్లు, కర్నాటక, తమిళనాడు, కేరళలో ఓపెనింగ్ రోజున రూ 15 + కోట్లు గడించగలదని భావిస్తున్నారు. ఇదో పెద్ద మల్టీ స్టారర్ మూవీ.

బుక్ మై షో టికెటింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా తొలి రోజుకే గంటలో 36000 టికెట్లు తెలంగాణలో అమ్మడయిపోయాయి. దేశవ్యాప్తంగా తొలిరోజే 2లక్షల టికెట్లు అమ్మడయిపోయాయి. నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా టికెట్లు 125000కు పైగా అమ్ముడయ్యాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News