Monday, January 20, 2025

ముంబైలో కల్కి 2898 ఏడీ ట్రైలర్ వేడుక

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచాన్ని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మూవీ రిలీజ్‌కు ముందు నాగ్ అశ్విన్ బుజ్జి, భైరవను పరిచయం చేసిన విధానానికి అంతా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ బుజ్జి.. దేశంలోని పలు నగరాల్లో తిరుగుతోంది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు కూడా రానున్నట్లు తెలిసింది.

అయితే ఢిల్లీ, ముంబైలో ఫిల్మ్‌మేకర్స్ భారీ స్థాయిలో రెండు ఈవెంట్స్ నిర్వహిస్తారని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్‌లో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఈనెల 7న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నారట. ఇక సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్, బ్రహ్మానందం, స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి పలువురు నటీనటులు సినిమాలో నటిస్తున్నారు.

హీరోయిన్ కీర్తి సురేష్.. బుజ్జి వెహికల్‌కు వాయిస్ ఓవర్ చెప్పి సినిమాలో భాగమైంది. భైరవగా ప్రభాస్.. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. అయితే కల్కి సినిమా 2 గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలిసింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న కల్కి మూవీ ఈనెల జూన్ 27న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News