Tuesday, September 17, 2024

అదరగొట్టిన ‘కల్కి 2898ఎడి’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898ఎడి’ ఫస్ట్ ట్రైలర్ అద్భుతమైన స్పందనతో సంచలనం సృష్టించింది. ఆడియన్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్న రిలీజ్ ట్రైలర్‌ను ఇప్పుడు విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ గ్లింప్స్ భారతీయ పురాణాలలో రూట్ అయిన ‘కల్కి 2898ఎడి’ సినిమాటిక్ యూనివర్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తే, తాజా ట్రైలర్ ఇంకా లోతుగా ఎపిక్ నెరేటివ్‌ని మహా అద్భుతంగా చూపింది. ట్రైలర్ వారి అద్భుతమైన అవతారాలలో లార్జర్ దెన్ లైఫ్ హీరోలను చూపింది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’గా డేరింగ్ స్టంట్స్‌ని పెర్ఫామ్ చేశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ ‘యాస్కిన్’గా గుర్తించలేని డెడ్లీ అవతార్‌లో కనిపించారు.

‘బుజ్జి’తో కలిసి ప్రభాస్ ’భైరవ’గా బౌంటీ హంట్‌లో అదరగొట్టారు. దీపికా పదుకొణె ‘సుమతి’ పాత్రను అద్భుతంగా పోషించింది. దిశా పటానీ ‘రాక్సీ’గా పవర్ ఫుల్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ట్రైలర్ ‘కల్కి 2898ఎడి’లోని మూడు డిఫరెంట్ వరల్డ్స్‌ని పరిచయం చేసింది. కాశీ, మనుగడ కోసం పోరాడుతున్న చివరిగా మిగిలిన నగరం; కాంప్లెక్స్, ఉన్నత వర్గాలచే నియంత్రించబడే ఆకాశంలో ఒక స్వర్గం; మూడోది శంబాలా, కాంప్లెక్స్ ద్వారా హింసించబడిన వారికి ఆశ్రయం అందించే ఒక ఆధ్యాత్మిక భూమి. అవుట్ స్టాండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టాప్ క్లాస్ విఎఫ్‌ఎక్స్, బ్రీత్ టేబీత్ విజువల్స్‌తో ఈ మూవీ ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ తో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది.

‘కల్కి 2898 ఎడి’ దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీ అప్రోచ్, అద్భుతమైన విజువల్స్, స్టొరీ టెల్లింగ్‌తో ఇండియన్ సినిమాని రిడిఫైన్ చేయగలదని ప్రామిస్ చేస్తోంది. ట్రైలర్‌లో మహాభారతానికి సంబంధించిన రిఫరెన్స్ స్టాండ్ అవుట్ మూమెంట్‌గా నిలిచింది. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ మూవీ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News