Thursday, January 23, 2025

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

- Advertisement -
- Advertisement -

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా వాయిదా పడనునట్లు తెలుస్తోంది. బహుబలి తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు సో సోగా ఆడాయి. దీంతో అభిమానులు డిజాపాయింట్ అయ్యారు. ఈక్రమంలో సాలిడ్ ప్రాజెక్టుతో అభిమానులను మెప్పించేందుకు సిద్ధమయ్యాడు ప్రభాస్. ఏకంగా పాన్ వరల్డ్ సినిమాతోనే వచ్చేందుకు రెడీ అయ్యాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి సినిమాపై ప్రభాస్ ఆశలు పెట్టుకున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రటకించారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు ఫిలీంనగర్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ సిినిమాను అప్పటి వరకు వాయిదా వేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఈ సిినమాను ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News