Saturday, January 18, 2025

ఆ రోజునే ‘కల్కి’ మూవీ రిలీజ్..!

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఎడి. ఈ చిత్రాన్ని వై జయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫోటోస్, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 27ను ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ సినిమాకు సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక, బాహుబలి తర్వాత సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమాపైనే ప్రభాస్ ఆశలు పెట్టుకున్నాడు. అభిమానులతోపాటు సినీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమలాసన్ తదితరల స్టార్లు నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News