Monday, December 23, 2024

‘కల్కి’ సినిమా మూడో రోజు రాబడి రూ. 415

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కల్కి 2898 ఏడి మూడో రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ. 415 కోట్లు (గ్రాస్ బాక్సాఫీస్ కలెక్షన్) ఆర్జించింది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలే తెలిపారు. ‘కల్కి 2898 ఏడి’ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు బద్ధలు కొడుతోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటానీ, విజయ్ దేవర్ కొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఈ సినిమా హిందు పౌరాణికం ‘మహాభారతం’, సైన్స్ ఫిక్షన్ కలబోత సినిమా. వైజయంతీ మూవీస్ ఈ సినిమా నిర్మించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఈ చిత్రాన్ని నిర్మించారు. అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. దర్శకుడు నాగాశ్విన్ ఈ తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం ఈ సినిమా భారతీయ సినిమా రేంజ్ ను పెంచేసిందన్నారు. నటి రష్మిక మందన్న అయితే ‘‘కల్కి సినిమా రూపొందించినందరికీ కంగ్రాచ్యులేషన్స్, మన పౌరాణిక దేవతలను చూయించడం బాగుంది. అబ్బబ్బా…ఎంత గొప్ప సినిమా!!!’’ అంటూ ట్వీట్ చేసింది.

ఈ సినిమా ఇంకా నాలుగు రోజులు గట్టిగా ఆడిందంటే నిర్మాణ ఖర్చులు పోను…లాభాలలోకి దూసుకెళ్లగలదని భావించాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News