- Advertisement -
తెలంగాణ ఎక్సైజ్ శాఖ పై బ్రహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరా కేఫ్‌కు వేదామృతం అని పేరు పెట్టడం పై బ్రాహ్మణులు మండిపడ్డారు. నీరా కేఫ్‌కు పేరు మార్చేలా చూడాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు కె.వి రమణాచారికి వినతిపత్రాన్ని బ్రాహ్మణ సంఘాలు అందించారు. వేదాలను కించపరిచేలా కల్లు కంపౌండ్‌కు వేదామృతం అని పేరు పెట్టారని బ్రాహ్మణులు ఆరోపించారు. దీని పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ కల్లు వేరే, నీరా వేరు అని తెలిపారు. వేదామృతం అనే పదం పై వివాదం ఉంటే పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. వేదాలను అధ్యాయనం చేసిన తరువాతే పేరు సూచించామని తెలిపారు.తాటి చెట్టును ప్రకృతి ఔషధంగా వేదాలు వర్ణించాయని మంత్రి వివరించారు. వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరముందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
- Advertisement -