Tuesday, November 5, 2024

కవులు, సాహితివేత్తలు, కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Kaloji Auditorium at Warangal: Minister Srinivas Goud

కాళోజీ నారాయణ రావు గొప్ప కవి
మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీలు

హైదరాబాద్: కాళోజీ నారాయణ రావు గొప్ప కవి, ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకోవడం అనందంగా ఉందని హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ కవి రామోజు హరగోపాల్‌కు మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీలు ప్రదానం చేశారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 108 వ జయంతి ఉత్సవాల సందర్భంగా కాళోజీ నారాయణ రావు జ్ఞాపకార్ధం రాష్ట్ర ప్రభుత్వం -తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కాళోజీ పురాస్కారాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ కాళోజీని ఎంతో అభిమానిస్తారన్నారు. వారి సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ యూనివర్సీటీకి, వరంగల్‌లో కళక్షేత్రానికి కాళోజీ నారాయణ రావు పేరు పేట్టి గౌరవిస్తుందన్నారు. వారి పేరుతో ఎర్పాటు చేసిన అవార్డుకు రామోజు హరగోపాల్‌ను ఎంపిక చేసి ఆవార్డు ఇవ్వడం అనందంగా ఉందన్నారు.

వరంగల్‌లో కాళోజీ పేరిట ఆడిటోరియం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ అదేశాల మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికలు, కవులు, సాహితివేత్తలు, కళాకారులు, చరిత్రకారులు, సామాజిక వేత్తల, సంఘ సంస్కరణ వేత్తలతో పాటు మేధావులను గుర్తించి వారిని గౌరవిస్తున్నామన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకొని సిఎం కెసిఆర్ అదేశాల మేరకు తెలంగాణ భాషా దినోత్సవాన్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ భాషా దినోత్సవాన్ని, కాళోజీ పేరుతో ఎర్పాటు చేసిన అవార్డుకు ఎంపికైన రామోజు హరగోపాల్‌ను మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హరగోపాల్ అందించిన సాహిత్యం, వారి చేస్తున్న సేవలను మంత్రి ఈ సందర్భంగా కోనియాడారు. వరంగల్‌లో కాళోజీ పేరిట ఆడిటోరియం నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె వి రమణ, ప్రజా వాగ్గేయకారులు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురు గౌరిశంకర్, దీపిక రెడ్డి , శ్రీదేవి, చైర్మన్ తెలంగాణ అధికార భాషా సంఘం, ప్రముఖ కవి, జాతీయ అవార్డు పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమారు సుల్తానియా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News