Monday, December 23, 2024

కాళోజీ డాక్యుమెంటరీ అద్భుతం : ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాళోజీ ప్రజా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో పాలనను సాగిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా వరంగల్‌కు చెందిన సినీ దర్శకుడు ప్రభాకర్ జైని నిర్మించిన ప్రజాకవి కాళోజీ డాక్యుమెంటరీని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించి, తిలకించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ… కాళోజీ ప్రజా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు. కాళోజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగుతుందనానరు. డాక్యుమెంటరీ నిర్మించిన ప్రభాకర్ జైనీ ఆయన అభినందించారు. చిత్రం ప్రజాదరణ పొందాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News