Monday, December 23, 2024

కాళోజి తెలంగాణ భాష మాధుర్యాన్ని చాటిన మహనీయులు

- Advertisement -
- Advertisement -

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సీఎండి రఘుమారెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్:  ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి వేడుకలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి. రఘుమా రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై కాళోజిగారి చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భముగా సిఎండి మాట్లాడుతూ, కాళోజి తమ కవిత్వంతో తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి కలిగించారన్నారు. తెలంగాణ యాసలో తనదైన శైలిలో కవిత్వాలు రాస్తూ, తెలంగాణ భాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు కాళోజి అని కొనియాడారు.

కాళోజిగారి జయంతి రోజును తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ భాషా దినోత్సవం’ గా ప్రకటించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వినియోగదారులకు, తెలంగాణ ప్రజలకు సిఎండి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి. శ్రీనివాస్, జె. శ్రీనివాస రెడ్డి, జి పర్వతం, సిహెచ్. మదన్ మోహన్ రావు, ఎస్ స్వామి రెడ్డి, జి గోపాల్,సిజిఎం లు సాయిబాబా, నంద కుమార్, జాయింట్ సెక్రటరీ ప్రభాకర్, ఎస్ఈ శ్రీనివాస్, డిఈ లక్ష్మి నారాయణ ఇతర అధికారులు కాళోజి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News