హైదరాబాద్: ప్రజా కవి కాళోజీకి జిహెచ్‌ఎంసి ఘన నివాళ్లి అర్పించింది. కాళోజీ 108 జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ప్రజా కవి కాళోజీ నారాయణ చిత్రపటానికి పూల మాలా వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా కవి కాళోజీ నారాయణ తెలంగాణ సమాజానికే కాకుండా యావత్తు భారత దేశానికి స్ఫూర్తి దాయకంగా నిలిచారన్నారు. తన జీవితంతాం అన్యాయాలను అక్రమాల పై ఉద్యమ నడిపిన ప్రజా వాది గా నిలిచారన్నారు.
భవిష్యత్తు తరాల వారికి ఎల్లకాలం గుర్తుండే విధంగా మహాకవి కాళోజీ జయంతి ని ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించుకోంటోదన్నారు. అంతేకాకుండా కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ కూడా నెలకొల్పిందని చెపారు. బహు భాషా కోవిదుడు కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ మరాఠీ, కన్నడ , ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం పొందడమేకాకుండా ఈ బాషల్లో తన ప్రగతి శీల రచనలను కొనసాగించి ప్రజాకవిగా ఖ్యాతిని పొందరన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ తో పాటు అడిషనల్ కమిషనర్ విజయ లక్ష్మిసిపీఅర్ ఓ మొహమ్మద్ మూర్తుజా, పి అర్ ఓ జీవన్ తదితరులు కాళోజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.