Monday, December 23, 2024

మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

Kaloji Jayanthi Celebrations at Nirmal Municipal Office

నిర్మల్: కాళోజీ జయంతి పురస్కరించుకుని శుక్రవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ రచయిత, కవి కాళోజి నారాయణరావు తన రచనల ద్వారా ఎందరో మందికి స్ఫూర్తి నింపారని, ఆయన సేవలు మరువలేనివని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అరిగెల సంపత్ కుమార్, కౌన్సిలర్స్, కో ఆన్షన్ సభ్యులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News