Wednesday, January 22, 2025

రోదసి రంగంలో మహిళా ఇంజనీర్లకు కల్పన ఫెలోషిప్

- Advertisement -
- Advertisement -

స్కైరూట్ ఏరోస్పేస్ ప్రకటన

న్యూఢిల్లీ : అంతరిక్ష రంగంలో మహిళా ఇంజనీర్ల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన ‘కల్పన ఫెలోషిప్’ ప్రారంభిస్తున్నట్లు స్కైరూట్ ఏరోస్పేస్ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో ఇటువంటి ఫెలోషిప్‌ను ఇదే ప్రారంభించడం. అంతరిక్ష పరిశ్రమలో కొత్త శిఖరాలు చేరేందుకు తదుపరి తరం మహిళా ఇంజనీర్లకు స్ఫూర్తి ఇవ్వడం, ప్రోత్సహించడం, సాధికారత చేకూర్చడం లక్షంగా కల్పన ఫెలోషిప్‌ను రూపొందించినట్లు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఒక ప్రకటనలో తెలియజేసింది.

‘స్టెమ్, అంతరిక్ష రంగంలో మనకు మరింత మంది మహిళలు అవసరం. మహిళలు మరింత సృజనాత్మకత, ప్రభావం తీసుకురాగలరు. అందువల్ల అత్యాధునిక రోదసీ ప్రాజెక్టులలో పని చేసేందుకు, అగ్రశ్రేణి నిపుణుల నుంచి బోధనలు తీసుకునేందుకు, స్కైరూట్‌లో ప్రపంచ శ్రేణి మౌలిక వసతులను ఉపయోగించుకునేందుకు మహిళా ఇంజనీర్లకు ఉత్సుకత రేపే అవకాశాలు కల్పించడానికే కల్పన ఫెలోషిప్‌ను రూపొందించాం’ అని స్కైరూట్ సహ వ్యవస్థాపకురాలు, సిఇఒ పవన్ చందన తెలిపారు. వ్యోమగామి కల్పనా చావ్లా వారసత్వం ప్రేరణతో రూపొందించిన ఈ కార్యక్రమం కింద విజయవంతం అయిన అభ్యర్థులక ఒక ఏడాది పాటు నెలవారీ అలవెన్స్ లభిస్తుంది. సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలలో చివరి సంవత్సరం విద్యార్థులు, ఇటీవలే పట్టభద్రులైన వారు దరఖాస్తుకు అర్హులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News