Monday, December 23, 2024

సునీత కేజ్రీవాల్‌తో కల్పన సోరెన్ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ శనివారం ఢిల్లీలో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో సునీత కేజ్రీవాల్‌ను కల్పన సోరెన్ కలుసుకున్నారు. వారి సమావేశం 15, 20 నిమిషాల సేపు సాగిందని అధికారులు తెలిపారు. హేమంత్ సోరెన్ ఝార్ఖండ్‌లో భూమి కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో జైలు నిర్బంధంలో ఉన్నారు.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చాంపై సోరెన్‌తో పాటు కల్పన సోరెన్ ఆదివారం ‘ఇండియా’ కూటమి నేతల ర్యాలీకి హాజరు కానున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అరెస్టు తరువాత ‘ఇండియా’ కూటమి నేతలు ఆదివారం ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. సునీత కేజ్రీవాల్ కూడా ర్యాలీలో పాల్గొనవచ్చునని ఆప్ నేతలు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News