రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పన సొరేన్ సోమవారం గండే నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ రబీంద్ర నాథ్ మహతో ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి చంపీ సొరేన్, ఇతర జెఎంఎం పార్టీ నాయకులు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.
కల్పనం సొరేన్ గండే నియోజకవర్గం నుంచి ఉపఎన్నికలో గెలుపొందారు. ఆమె బిజెపి అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మ పై 27149 ఓట్ల తేడాతో గెలుపొందారు. జెఎంఎం ఎంఎల్ఏ సర్ఫారాజ్ అహ్మద్ రాజీనామాతో ఈ సీటుకు మే 20న ఉపఎన్నిక జరిగింది. 3.16 లక్షల మంది తమ ఓటును వినియోగించుకున్నారు.
ఆమె భర్త హేమంత్ సొరేన్ ను మనీలాండరింగ్ కేసులో ఈడి జనవరి 31న అరెస్టు చేసింది. హేమంత్ సొరేన్ తన అరెస్టుకు ముందే పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్ లో ఇండియా బ్లాక్ ర్యాలీలలో కల్పన సొరేన్ ప్రముఖంగా కనిపించారు. గృహిణి అయిన ఆమె ఇంజనీరింగ్ , ఎంబిఏ డిగ్రీలు పొందారు. కల్పన సొరేన్ ముఖ్యమంత్రి కావడాన్ని సొరేన్ మరదలు సీతా సొరేన్ వ్యతిరేకించారు. దాంతో వారి కుటుంబంలో పొరపొచ్చలు ఏర్పడ్డాయి.
కల్పన సొరేన్ ‘‘నేను పోరాడాను, పోరాడుతాను! మనము గెలిచాము, మనము గెలుస్తుంటాము’’ అని ప్రకటించారు. కల్పన సొరేన్ పై బిజెపి విరుచుకుపడుతోంది. జార్ఖండ్ లో చంపాయ్ సొరేన్ ఓ కీలు బొమ్మ అని, కేర్ టేకర్ ముఖ్యమంత్రి అని అంటోంది.
VIDEO | JMM MLA Kalpana Soren was administered the oath of office in Ranchi earlier today.
Kalpana Soren, wife of former Jharkhand CM Hemant Soren, won Gandey Assembly constituency bypoll by 27,149 votes over her nearest BJP rival Dilip Kumar Verma.
(Full video available on… pic.twitter.com/A6BzPXSqIi
— Press Trust of India (@PTI_News) June 10, 2024