Saturday, January 18, 2025

14 ఏండ్ల ఆ బాలిక ఆత్మకు న్యాయం

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లో కిరాతక కాలూ, కన్హాలకు మరణశిక్ష

జైపూర్ : పరమ కిరాతక చర్యకు పాల్పడ్డ కాలూ, కన్హాలకు రాజస్థాన్‌లోని పోస్కో కోర్టు మరణశిక్ష విధించింది. గత ఏడాది ఆగస్టులో ఈ ఇద్దరు యువకులు 14 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిపి, తరువాత సజీవంగా ఆమెను బొగ్గుల కొలిమిలో పడేసి పాశవికంగా వ్యవహరించారు. వీరి దారుణచర్యకు ఓ అమాయక బాలిక బలి అయిందని పేర్కొంటూ వీరికి మరణశిక్షను విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహావీర్ సింగ్ కిషన్‌వత్ తెలిపారు.

శనివారం ఈ శిక్ష ఖరారయిందని వివరించారు. అన్ని విధాలుగా ప్రత్యక్ష సాక్షుల కథనం ఇతరత్రా దర్యాప్తు మేరకు కోర్టు ఈ కిరాతకుల నేరాన్ని నిర్థారించుకుంది. ఈ కేసులో సాక్షాలను తారుమారు చేసేందుకు యత్నించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురిని న్యాయస్థానం నిర్దోషులుగా పేర్కొంది. ఈ విషయంపై తాము హైకోర్టుకు వెళ్లుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. బాలికపై అత్యంత రాక్షసంగా జరిగిన ఈ దారుణం పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అయింది. తన బిడ్డకు న్యాయం దక్కిందని తీర్పు పట్ల ఆమె తల్లి సంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ దారుణ ఘటన జరిగింది.

ఈ ఉదంతంపై తమ ప్రభుత్వం అప్పట్లో సత్వర చర్యలకు దిగిందని, నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుందని మాజీ సిఎం అశోక్ గెహ్లోట్ తెలిపారు. గత ఏడాది ఆగస్టు 2వ తేదీన బాలిక పశువులను మేపేందుకు వెళ్లిందని, ఒంటరిగా ఉన్న బాలికను గమనించి ఇద్దరు యువకులు మానవ మృగాలుగా మారి ఆమెపై బడి తమ వాంఛతీర్చుకున్నారు. తరువాత కర్రలతో కొట్టి, ప్రాణం ఉండగానే చనిపోయింనుకుని పక్కనే ఉన్న కొలిమిలో పడేసి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులు ఎంతకూ బిడ్డ ఇంటికి రాకపోవడంతో తోటి గ్రామస్థులతో కలిసి అంతా కలియతిరిగారు. చివరికి బాలిక కడియం కన్పించింది. పక్కనే ఉన్న బొగ్గు కొలిమిలలో కేవలం బిడ్డ ఎముకలు కన్పించాయి.
…………………….

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News