Wednesday, December 25, 2024

ప్రధాని మోడీని నిగ్గదీసిన కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు నేపథ్యంలో బిఆర్ఎస్ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి ఆమె ప్రధాని మోడీపై, బిజెపి పై తీవ్ర ఆరోపణలు చేశారు.

అఖండ భారతంలో అదానికో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా? అని ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానినీ అరెస్టు చేయడం కష్టమా? అని నిలదీశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని మోడీ అదానీకి అండగా ఉంటూ వచ్చారన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత ఎక్స్ వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కవిత ట్వీట్ చేసిన గంటలోపే వేయికి పైగా లైక్స్, వందకు పైగా కామెంట్స్ వచ్చాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News