Monday, December 23, 2024

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణం…

- Advertisement -
- Advertisement -

Kalvakuntla Kavitha takes oath as Nizamabad MLC

హైదరాబాద్: ఇటీవల జరిగిన జామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోని ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం శాసనమండలి చైర్మన్ చాంబర్​లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కవిత ధన్యవాదాలు తెలియజేశారు. కవితతోపాటు కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు నేడు  ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమ్ముద్ అలీ, సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ మహ్మద్, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, ఫారూఖ్ హుస్సేన్, భాను ప్రసాదరావు, ఎమ్.ఎస్ ప్రభాకర్ రావు, ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు.

Kalvakuntla Kavitha takes oath as Nizamabad MLC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News