Sunday, February 23, 2025

ప్రాణం తీసిన దోశ

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు: దోశ తింటుండగా ముక్క ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా  కల్వకుర్తి పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కల్వకుర్తి మండలం కేంద్రంలోని సుభాష్ నగర్ లో వెంకటయ్య(43) అనే వ్యక్తి భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం 11 గంటలకు హోటల్ నుంచి దోశ తీసుకొని ఇంటికి వచ్చాడు. దోశ తింటుండగా దాని ముక్క ఇరుక్కోవడంతో ఊపరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News