- Advertisement -
కల్వకుర్తి: కల్వకుర్తి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రాపోతు అనిల్ గౌడ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఎలక్షన్‌లు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి బిసిలను మభ్యపరచడానికి ఇలాంటి స్కీములకు తెరలేపారని, నిజంగా ముఖ్యమంత్రికి బిసిలపై చిత్తశుద్ది ఉంటే హుజురాబాద్ బై ఎలక్షన్‌ల టైంలో బిసి బంధు పది లక్షలు త్వరలోనే ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత తొమ్మిదేళ్లుగా బిసి కార్పొరేషన్‌ను మరిచి ఒక్కరికి కూడా కార్పొరేషన్ లోన్‌లు ఇవ్వలేదని గుర్తు చేశారు. బిసిలకు గత తొమ్మిదేళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయకుండా నేడు బిసిల విచ్చినానికి తెరలేపారని, బిసి సమాజం బిసి సంఘాల నాయకులు వెంటనే దీనిపై మాట్లాడాలని, బిసి బంధు పది లక్షలు ఇచ్చేదాక అందరు పోరాడాలని ఆయన కోరారు.
- Advertisement -