Wednesday, January 22, 2025

తెలంగాణ ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి వరం

- Advertisement -
- Advertisement -
  • ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే సిఎం లక్షం
  • ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఆటోను లబ్ధిదారుడికి అందజేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బెజ్జంకి: తెలంగాణ పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్ప ంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సిఎ ం కెసిఆర్ ప్రవేశ పెట్టారని మానకొండూరు ఎ మ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మంగళవా రం మండలంలోని పలువురు లబ్ధిదారులకు మం జూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలకు కెసిఆర్ కిట్టుద్వారా ఆడబిడ్డ జన్మిస్తే 13 వేల రూపాయలు, మగ బిడ్డకు 12 వేల రూపాయలు ఇస్తూ పేదించి ఆడబిడ్డలకు కొండంత భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు

ఆటో డ్రైవర్‌గా ఎమ్మెల్యే

పెరకబండ గ్రామానికి చెందిన సురేశ్‌కు ఎస్సీ కా ర్పొరేషన్ ద్వారా మంజూరైన ఆటోను స్వయంగా ఎమ్మెల్యే నడిపి లబ్ధిదారుడికి అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నిర్మల, పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు సం జీవ్‌రెడ్డి, ముక్కిస తిరుపతిరెడ్డి, కనగండ్ల రాజేశం, ఎంపిటిసి మహేందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గుప్తా, కచ్చు రాజయ్య, కనగండ్ల తిరుపతి, ఎర్రవెల్లి శ్రీనివాస్, కర్రెవుల మల్లేశం, బోనగిరి శ్రీనివాస్, ఎలా శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీ డైరెక్టర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

గుగ్గిళ్ల గ్రామానికి చెందిన చెప్యాల లింగయ్యగౌడ్ ఇటీవల మరణించగా మృతుని కుమారుడు బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెప్యాల సంపత్ గౌడ్‌ను రాష్ట్ర సాంస్కృతిక సారధి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించి ప్ర గాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు సర్ప ంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ తిరుపతి, పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గుప్తా, లక్ష్మణ్, తిరుపతి, సీత భూమయ్య, బోనగిరి శ్రీనివాస్, ఎలా శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News