Sunday, December 22, 2024

పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి వరప్రదాయిని

- Advertisement -
- Advertisement -
  • విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

లింగాల: సిఎం కెసిఆర్ మానస పుత్రికగా చెప్పబడే కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరప్రదాయని వంటిదని, పేదల సంక్షేమం కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 64 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింట్లో ఆడబిడ్డ పెళ్లి చేయడానికి పడే కష్టాలను చూసి చలించిపోయిన సిఎం కెసిఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు.

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా నిరుపేదలు సంతోషంగా ఆడబిడ్డల వివాహాలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో అందుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడవ సారి సిఎం కెసిఆర్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేదల పాలిట పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా ఫించన్ అందిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేలా చూస్తామన్నారు.

అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుధీర్ గౌడ్, సింగిల్ విండో చైర్మెన్ ఆనంద్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నూకం తిరుపతయ్య, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు కేటి తిరుపతయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రవి శంకర్, బిఆర్‌ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రానోజి, ఎంపిడిఓ గీతాంజలి, తహసిల్దార్ మునిరుద్దీన్, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News