మాగనూర్: పేదలకు కల్యాణలక్ష్మిపథకం పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 27మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మిచెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పేదింట్లో ఆడపిల్లలు జన్మిస్తే తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు ఇబ్బందులు పడేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వత సిఎం కెసిఆర్ ఆడపడుచులకు అండగాఉంటూ దేశంలో ఎక్కడా లేని పథకాలను ఇక్కడ అమలు చేస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి…
బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఓబ్లపూర్ గ్రామానికి రూ.15లక్షల వ్యయంతో చేపడుతున్న రోడ్డు పనులకు గురువారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సర్పంచు నారాయణ, ఆయా గ్రామాల బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.