Wednesday, April 16, 2025

తల్లి కోసం ఎంత త్యాగం చేయొచ్చు అనేది చూస్తారు

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “కళ్యాణ్ రామ్ డెవిల్, అమిగోస్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఉన్నారు. ముందుగా మాస్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాము. మాస్ జోనర్ లో హీరో క్యారెక్టర్‌ని తయారు చేశాను. తర్వాత ఒక పవర్‌ఫుల్ మదర్ క్యారెక్టర్ ని అనుకున్నాం.

ఈ మదర్ వైజయంతి లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ముందు హీరోకి చెప్పాం. ఆయన చేద్దాం అన్నారు కానీ విజయశాంతి ఒప్పుకుంటేనే చేద్దాం అని క్లియర్ గా చెప్పారు. విజయశాంతికి కథ చెప్పాం. మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత సినిమాను సెట్స్ మీద తీసుకువెళ్లాం. -విజయశాంతి ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా చేశారు. విజయశాంతి కథ విన్నప్పుడే తాను ఫైట్స్‌కి సిద్ధమని చెప్పారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో తల్లి కోసం ఎంత త్యాగం చేయొచ్చు అనేది ఆడియన్స్ చూస్తారు. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

-సినిమాలో విజయశాంతి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ పృథ్వి మాస్టర్ చేశారు. రామకృష్ణ మాస్టారు ఇంటర్వెల్, క్లైమాక్స్ రెండు ఫైట్లు చేశారు. పీటర్ మాస్టర్ హీరో ఇంట్రడక్షన్ క్లైమాక్స్ ఫైట్ చేశారు. విలన్ సీక్వెన్స్ రెండు రఘువరణ్ మాస్టర్ చేశారు. ఫైట్లన్నీ చాలా అద్భుతంగా వుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ అజినీష్ -రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. రీ రికార్డింగ్ నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. కళ్యాణ్ రామ్ -బలం ఎమోషన్. ఎమోషన్‌ని అదరగొట్టేస్తారు. -తల్లితండ్రులు మన బర్త్ డేని ఒక సెలబ్రేషన్స్‌లా చేస్తారు. తల్లిదండ్రుల బర్త్ డేని మనం సెలబ్రేట్ చేయడం ఒక ఎమోషన్. అదే ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News