Monday, December 23, 2024

స్టైలిష్‌గా కళ్యాణ్‌రామ్..

- Advertisement -
- Advertisement -

‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అమిగోస్’. డెబ్యూ డైరెక్టర్ రాజేంద్ర రెడ్డితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రం రూపొందిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. ఇటీవల రెండు లుక్స్ విడుదల చేశారు. ఓ లుక్‌లో మెలివేసిన మీసాలతో స్టైలిష్ లుక్‌లో ఎంట్రప్రెన్యూర్ సిద్ధార్థ్ పాత్రలో కనిపించాడు. ఆతర్వాత మంజునాథ్ అనే అమాయకంగా కనిపించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కళ్యాణ్‌రామ్ దర్శనమిచ్చాడు.

ఈ రెండు లుక్స్‌కి ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. గత రెండు లుక్స్‌తో పోల్చితే ఈ లుక్ మరింత స్టైలిష్‌గా ఉంది. కానీ ఈ పాత్రను అజ్ఞాత వ్యక్తి పాత్ర అని చెప్పారు. అసలు ఈ మూడు లుక్స్‌కి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 10న రిలీజ్ అయ్యే అమిగోస్ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈనెల 8న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News