Sunday, January 5, 2025

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో భార్య వేధింపుల తట్టుకోలేక భర్త ఉరేసుకున్న సంఘటన ఢిల్లీలోని కళ్యాణ్ విహార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కళ్యాణ్ విహార్‌ ప్రాంతంలో పునీత్ ఖురానా(40), అతని భార్య మానికా జగదీశ్ పహ్వా ఇద్దరు కలిసి ఉడ్‌బాక్స్ కేఫ్ అనే బేకరి నిర్వహిస్తున్నారు. దంపతుల మధ్య గొడవలు జరగడంతో విడాకులు కేసు కోర్టు పరిదిలో ఉంది. పునీత్‌ను అతని భార్య మానికా ఫోన్ చేసి మనం విడాకులు తీసుకున్నాం కానీ, తాను ఇంకా వ్యాపార భాగస్వామిగానే ఉన్నానని, తనకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అంటూ వేధింపులకు గురిచేసింది. దీంతో తన ఇంట్లో పునీత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పునీత్ ఫోన్‌లో తన భార్యతో మాట్లాడిన 16 నిమిషాల కాల్ రికార్డ్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. గతంలో ముఖ కేఫ్ యజమాని అతుల్ సుభాశ్ భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News