Monday, December 23, 2024

156 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ : గంగుల కమలాకర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి పథకం యావత్ ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని రాష్ట్ర బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజక వర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్ అర్బన్, రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు రెక్కాడితే గాని డోక్కాడని పేదలు తమ ఆడబిడ్డల పెళ్లి కోసం అప్పులు చేసి, ఆ అప్పులకు మిత్తిలు కట్టి అనేక ఇబ్బందులు పడే వారన్నారు. ఈ ప్రపంచంలో గొప్ప దేశాలైన అమెరికా, చైనా, రష్యా లో కానీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల ఇంటి మేనమామగా మారి ఆడబిడ్డ పెళ్లికి రూ1,00,116/- కానుక అందిస్తున్నారన్నారు. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉండే పరిస్థితి ఉండేదని, నేడు 24 గంటలు విద్యుత్తు, పుష్కలంగా నీరు ఉందని గంగుల కొనియాడారు. పేదలకు, వృద్ధులకు వితంతువులకు ఆసరా పింఛన్లు, మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారని, తెలంగాణ కోసం కెసిఆర్ ను బలోపేతం చేయాలని, కెసిఆర్ నిండు నూరేళ్లు బ్రతికేలా దీవెనలు, ఆశీర్వచనాలను అందివ్వాలని మంత్రి కోరారు.

ఈ సందర్భంగా కొత్తపల్లి మండలానికి చెందిన 43 మంది లబ్దిదారులకు రూ.43,04,988, కరీంనగర్ అర్బన్ కు చెందిన 86 మంది కి రూ.86,09,976, కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన27 మంది లబ్ధిదారులకు 27,03,132 మొత్తం 1కోటి 56 లక్షల18వేల 096/-రూపాయల విలువ గల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్ రావు, కరీంనగర్ ఆర్ డి ఓ ఆనంద్ కుమార్, ఎంపిపి తిప్పర్తి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, జడ్పిటిసి పిట్టల రవి, కో ఆప్షన్ మెంబర్ సాబీర్ పాష, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, వాలా రమణ రావు, తహసిల్దార్లు సుధాకర్, కార్పొరేటర్లు, సర్పంచులు ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News