Monday, December 23, 2024

కళ్యాణలక్ష్మి పథకం పేదింటి యువతులకు అండ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిః కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి యువతుల వివాహానికి ఎంతగానో తోడ్పడుతున్నాయని, దేశంలో ఎక్కడ లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలువుతన్నాయని తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలోని తహశీల్దార్ కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను తెలంగాణ చేనేత అభివృద్ది సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్ అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. పేదింటిలో యువతులు వివాహానికి తల్లిందడ్రులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడేవారిని, పేదల పెళ్లిళ్లకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా సిఎం కెసీఆర్ మేనమామల మారి యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ లాంటి పథకాలు లేవన్నారు. తెలంగాణ పథకాలు కేంద్రం కాపీ కొడుతుందన్నారు.

అదే విధంగా రోగులకు వివిధ రకాల చికిత్సల నిమిత్తం మెరుగైన వైద్యం కోసం 27మందికి సిఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం, మున్సిపల్ చైర్మెన్ బొంగుల విజయలక్ష్మి, తహశీల్దార్ విజయ్‌కుమార్, నాయకులు బొంగుల రవి, విజేందర్‌రెడ్డి, మనోహర్‌గౌడ్, ప్రభాకర్, కంది జడ్‌పిటిసి కొండల్‌రెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News