Tuesday, March 4, 2025

పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో కళ్యాణ కాంతులు

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్‌: పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, దీనిలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద ప్రజలకు ఎంతో అసరాగా నిలుస్తున్నాయని జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లా కేంద్రంలోని జనకపూర్‌లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 65 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అరిగెల మల్లికార్జున్, జడ్పిటిసి అరిగెల నాగేశ్వర్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ ఆలిబిన్ హైమద్, మాజీ ఎంపిపి బాలేష్‌గౌడ్, మండలంలోని ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News