Saturday, December 21, 2024

ఆడబిడ్డల పెండ్లిళ్లకు సర్కార్ అండ

- Advertisement -
- Advertisement -

వెల్దుర్తిః తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెండ్లిళ్లకు పెద్దన్నలా సీఎం కసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎంపీపీ స్వరూప నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను జడ్పీటీసీ రమేష్‌గౌడ్ తో కలిసి ఎంపీపీ అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… పేదలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

ఆడబిడ్డల పెండ్లిళ్లకు తెలంగాణ సర్కార్ డబ్బులు ఇవ్వడం తెలంగాణలో మాత్రమే ఉందని, ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే సిఎం కెసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి,తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీవో జగదీశ్వరచారి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News