Sunday, December 22, 2024

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

సదాశివపేటః కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సదాశివపేట తహశీల్దార్ మనోహర్‌ చక్రవర్తి అన్నారు. శనివారం సదాశివపేటలోని ఐబిలో సదాశివపేట పట్టణ మండలంలోని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని ఆర్థికంగా లబ్దిపొందాలన్నారు. పేదింటి యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాలు ఎంతో లబ్ధిచేకూరుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ చింత గోపాల్, కౌన్సిలర్‌లు పిల్లోడి విశ్వనాథం, ఇంద్రమోహన్‌గౌడ్, విద్యాసాగర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, మండల అధ్యక్షుడు ఆంజనేయులు నాయకులు చింత సాయినాథ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News