Thursday, January 23, 2025

పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి వరం

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్మాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలు ఒక వరమని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని తహసిల్ కార్యాలయంలో సోమవారం లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎంపీ వెంకటేష్‌నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ గ్రామాల్లోని పేద ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. బలహీన వర్గాల తల్లిదండ్రులు తమ ఆడపిల్లల పెండ్లి ఖర్చుల కోసం ఆర్దిక ఇబ్బందులు పడుతుండగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముభారక్ పథకాలు వారికి చేయూతనందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుభీమా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వందేనన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఆయన అన్నారు. మన ఊరు మన బడితో పాఠశాలల్లో విద్యార్థుల ఇబ్బందులు తొలగించడానికి సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ మోటపలుకుల గురువయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, తహసిల్దార్ హన్మంతరావు, సహకార సంఘం అద్యక్షులు కాసనగొట్టు లింగన్న, బెడద సురేష్, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, ఆర్‌ఐ రంజిత్, సర్పంచ్‌లు భీము, లక్ష్మణ్, నాయకులు గొట్ల భూమన్న, బొలిశెట్టి రమేష్, గడిపెల్లిసత్యం, పూరేళ్ల చిన్నలక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ….
దండేపల్లి మండలంలోని కాసిపేట, లక్ష్మికాంతపూర్, లింగాపూర్, చెల్కగూడ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు సోమవారం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో పల్లె ప్రగతితో పారిశుద్యం లోపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుంద న్నారు. గ్రామాల అభివృద్దికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తుందన్నారు.

గ్రామ పంచాయతీ భవనాలు లేని చోట కొత్త భవనాలకు నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు బంధు జిల్లా కన్వీనర్ గురువయ్య, సర్పంచ్‌లు మైదం యశోద గంగారెడ్డి, జాడి తిరుపతి, సత్యవతి, జడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News