నల్లగొండ:కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని దేవరకొండ శాసనసభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలానికి చెందిన 117మందికి రూ.1.17కోట్లు కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను, చీరలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వార అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ లబ్దిపొందడం జరుగుతుంది అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేది ంటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.
పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్ కే దక్కుతున్నదని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చిం తపల్లి సుభాష్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు టివిఎన్ రెడ్డి, రేపని ఇద్ద య్య, పొన్నబోయిన సైదులు, ఉప సర్పంచ్ సామల రవి, ముడవత్ జయప్రకాష్ నారాయణ, మాచర్ల అంజయ్య, కడరీ తిరపతయ్య, బిఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ, తౌఫిక్ ఖాద్రీ, ఏటేల్లి పార్వతయ్య, అశోక్, ఇలియస్ పటేల్, సత్తార్, సత్యనారాయణ, ఆఫ్రోజ్,తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.