Tuesday, March 18, 2025

కళ్యాణ లక్ష్మీ ఇకపై కళ్యాణమస్తు:మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. శాసనమండలిలో ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. ప్రభుత్వం మహిళలకు గత 10 సంవత్సరాల కంటే మెరుగైన పథకాలను తీసుకువచ్చిందన్నారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని తాము సైతం కొనసాగిస్తామని, కళ్యాణ లక్ష్మిని కళ్యా ణమస్తుగా మార్చి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తామని తెలి పారు.

2, 3 సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మీ పథకానికి సంబంధించి బకాయిలు ఉన్నాయని, వాటిని తాము పూర్తిచేయడం జరిగిందంటూ ప్రక టించారు. కళ్యాణ లక్ష్మి నిధులకు సంబంధించి ఇబ్బంది లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వివాహాలు చేసుకునే వారికి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వివాహం జరిగిన ఎన్నో ఏళ్లకు చెక్కులు తీసుకునే పరి స్థితి ఉండేదని, ప్రస్తుతం బకాయిలు లేకుండా తాము వెంటనే చెల్లిస్తున్నట్లు పొన్నం తెలిపారు. కళ్యాణ లక్ష్మి పెండింగ్ బకాయిలపై బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఖచ్చితంగా తెలంగాణలో కళ్యాణ లక్ష్మి తాము బరాబర్ కొనసాగిస్తామని మంత్రి పొన్నం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News