Monday, January 20, 2025

నడిగర్ సంఘం ట్రస్టీగా కమల్‌హాసన్!

- Advertisement -
- Advertisement -

Kamal Haasan
చెన్నై: మూడేళ్లగా ఎదురుచూస్తున్న ‘నడిగర్ సంఘం’(తమిళ సినీ నటుల సంఘం) ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. నటుడు నాజర్ నేతృత్వంలోని ‘పాండవర్ అని’ ప్యానెల్ గెలిచింది. కాగా నడిగర్ సంఘం కొత్త కార్యవర్గం ఇటీవల ప్రమాణ స్వీకారం చేసింది. తర్వాత జరిగిన కార్యవర్గ సమావేశంలో అనేక తీర్మానాలు ఆమోదించారు. నడిగర్ సంఘం మేనేజింగ్ ట్రస్టీలుగా మరో తొమ్మిది మందిని నియమిస్తూ తీర్మానించారు. మొత్తం తొమ్మిది మంది సభ్యుల్లో కొత్త కార్యవర్గం నుంచి నాజర్, విశాల్, కార్తీ, కార్యవర్గ సభ్యుల నుంచి రాజేశ్, లతా సేతుపతి, కోవై సరళ, జనరల్ టీమ్ నుంచి కమల్ హాసన్, పి.మురుగన్, సచ్చు(సరస్వతి)లకు స్థానం లభించింది. ఈ ట్రస్టీకి అధ్యక్షుడిగా నాజర్ ఉంటారు. నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణ పనులు మూడు నెలల్లో తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రతి నెల రెండో ఆదివారం సంఘం సమావేశం నిర్వహించాలని చాలా అంశాలపై తీర్మానాలు చేయాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News