Monday, December 23, 2024

కులమే అతిపెద్ద రాజకీయ శత్రువు : కమల్ హాసన్

- Advertisement -
- Advertisement -

చెన్నై : తనకు అతిపెద్ద రాజకీయ శత్రువు కులమేనని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) చీఫ్ కమల్‌హాసన్ అన్నారు. ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున కమల్ ప్రచారం చేయనున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు పా రంజిత్ నేతృత్వంలో నీలం కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేసిన నీలం బుక్స్‌ను కమల్ ప్రారంబించిన తరువాత మాట్లాడుతూ కులం తనకు అతిపెద్ద శత్రువని వ్యాఖ్యానించారు. తనకు 21 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి ఈ విషయాన్ని చెబుతున్నానని, ఇంకా చెబుతుంటానని, నా అభిప్రాయం మారదని పేర్కొన్నారు.

చక్రాన్ని కనిపెట్టిన తర్వాత మనిషి దేవుడిని సృష్టించాడని, మనం సృష్టించింది మనమీదే దాడి చేస్తే అంగీకరించేది లేదని వ్యాఖ్యానించారు. పా రంజిత్ ఆర్ట్ ఫిల్మ్‌ను కూడా అందరికీ నచ్చే చిత్రంగా మలిచే ఫార్ములాను ఆకళింపు చేసుకున్నాడని ప్రశంసించారు. నీలం బుక్స్ గురించి రంజిత్ మాట్లాడుతూ ప్రజలు రాజకీయాలను అర్థం చేసుకోడానికి వీలుగా ఈ బుక్స్‌ను జాగ్రత్త చేస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News