Tuesday, September 17, 2024

ఏఐ చదవడానికి అమెరికాకు కమల్ హాసన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: నటుడు కమల్ హాసన్ కు 69 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా ఏదో నేర్చుకోవాలన్న తప్పన తగ్గలేదు. ఆయన అమెరికాలోని టాప్ ఇనిస్టిట్యూట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చదవడానికి అమెరికాకు వెళ్లారు. ఆయన అక్కడ 90 రోజుల ఏఐ కోర్సులో 45 రోజులే హాజరు కానున్నారు. తర్వాత తన పనులు చేసుకోడానికి స్వదేశానికి తిరిగి వచ్చేస్తారు. కమల్ హాసన్ తన భవిష్యత్తు ప్రాజెక్టులలో ఏఐ ని ఉపయోగిస్తారని అనిపిస్తోంది.

‘‘ సినిమా నా జీవితం. కొత్త టెక్నాలజీ అంటే నాకు మక్కువ ఎక్కువ. నేను నా చిత్రాల్లో కొత్త ప్రయోగాలు చేయడం మీరు చూసే ఉంటారు. నేను సంపాదించిందంతా తిరిగి సినిమాకే అనేక విధాల వాడుతుంటాను. నేను కేవలం నటుడినే కాదు. నిర్మాతను కూడా. సినిమాలలో సంపాదించిందంతా తిరిగి నేను సినీ రంగంలోనే పెడుతుంటాను’’ అని కమల్ హాసన్ గత ఏడాది ఓ ప్రచురణ సంస్థకు తెలిపారు.

కమల్ హాసన్ ఇండియన్2, అలాగే నాగ్ అశ్విన్ తీసిన ‘కల్కి 2898ఏడి’లో ఇటీవల నటించారు. కమల్ హాసన్ శంకర్ తీయబోతున్న ‘ఇండియన్ 3’ లో, అలాగే మణిరత్నం వచ్చే ఏడాది తీయబోతున్న ‘థగ్ లైఫ్’ లో కూడా నటించనున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) లో ప్రభావం చూపిన వారిలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ని ఇదివరలో ‘టైమ్’ మ్యాగజైన్ సెలెక్ట్ చేసింది. ఆయన గళం, మ్యానరిజం, డయలాగ్, ‘ఝకాస్’ అనే క్యాచ్ ఫ్రేస్ ను కూడా టైమ్స్ మ్యాగజైన్ రిజర్వ్ చేసింది.  ఆ జాబితాలో హాలీవుడ్ నటుడు స్కార్లెట్ జాన్సన్ ను కూడా అనిల్ తో పాటు ఉన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News