Monday, December 23, 2024

మహిళా డ్రైవర్‌కు ఉద్వాసన..కారు కొనిచ్చిన కమల్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: యాజమాన్యానికి చెప్పకుండా డిఎంకె ఎంపి కనిమోళిని బస్సు ఎక్కించినందుకు ఉద్యోగం కోల్పోయిన ప్రైవేట్ బస్సు మహిళా డ్రైవర్ షర్మిలకు ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోమవారం ఒక కొత్త కారును బహుకరించారు. తన బస్సులో ప్రయాణించిన కనిమోళికి టిక్కెట్ ఇవ్వడంపై ఏర్పడిన వివాదం కారణంగా జూన్ 23న షర్మిల తన ఉద్యోగాన్ని కోల్పోయారు. కోయంబత్తూరులో బస్సు ఎక్కిన కనిమోళి పట్ల టిక్కెట్ విషయంలో దురుసుగా ప్రవరించిన కండక్టర్‌తో డ్రైవర్ షర్మిల గొడవ పడ్డారు. దీంతో పబ్లిసిటీ కోసం సెలబ్రిటీలను బస్సు ఎక్కించుకున్నారని ఆరోపిస్తూ బస్సు యజమాని షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించారు.

ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని కమల్ హాసన్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధిని కల్పించుకునేందుకు షర్మిలకు కమల్ కల్చరల్ సెంటర్ ద్వారా ఒక కొత్త కారు అందచేస్తున్నట్లు కమల్ తెలిపారు. అనాదిగా అణచివేతకు గురవుతున్న మహిళలకు అండగా తామంతా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా..గత శుక్రవారం డిఎంకె కనిమోళి కోయంబత్తూరులోని గాంధీపురం వద్ద షర్మిల డ్రైవ్ చేస్తున్న ప్రైవేట్ బస్సు ఎక్కారు. అయితే టిక్కెట్ విషయంలో కండక్టర్ ఎంపీ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో కండక్టర్‌తో షర్మిల గొడవపడ్డారు. గమ్యస్థానానికి ముందే కనిమోళి బస్సు దిగిపోయారని, కండక్టర్ ప్రవర్తన పట్ల తాను ఆమెకు క్షమాపణ చెప్పానని షర్మిల మీడియాకు వివరించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత బస్సు యజమాని దురై కన్నన్ షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించారు. కనిమోళి బస్సులో ప్రయాణిస్తున్నారన్న విషయం తమకు ముందుగా షర్మిల తెలియచేయలేదని, చెప్పి ఉంటే తగిన ఏర్పాట్లు చేసేవారమని ఆయన వివరించారు. కాగా..ఈ రోపణలను షర్మిల కొటివేశారు. తాను ముందుగానే కనిమోళి ప్రయాణం గురించి యజమానికి చెప్పానని ఆమె తెలిపారు.

కాగా..తన కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న షర్మిలకు కనిమోళి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అవసరమైతే బస్సు యజమాని కన్నన్‌తో తానుమాట్లాడి తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని కనిమోళి ఆమెకు తెలిపారు. అయితే..షర్మిల మాత్రం తాను ఇక అక్కడ పనిచేయదలచుకోలేదని, సొంతంగా ఆటో నడుపుకుంటానని చెప్పడంతో ఆ ఆటోకు అవసరమైన ధనసహాయం తానే చేస్తానని కనిమోళి హామీ ఇచ్చారు. కాగా..మక్కళ్ నీధి మయ్యమ్ అధినేత కమల్ హాసన్ షర్మిలకు కొత్త కారు బహుకరించింది కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News