Monday, December 23, 2024

నా కోరిక నిజమైంది: అనందంలో ప్రభాస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘ప్రాజెక్టు కె’. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో వై జయంతఅ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విలక్షణ నటుడు కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిటీ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఇప్పటికే ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తోపాటు హాట్ బ్యూటీస్ దీపికా పడుకొనె, దిశా పటానీలు నటిస్తున్న విషయం తెలిసిందే.

Kamal Haasan join Prabhas' Project K Movie

తాజాగా కమల్ కూడా ఈ ప్రాజెక్టులో జాయిన్ కావడంతో అంచనాలు పెరిగాయి. ఈ సందర్భంగా ప్రభాస్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ”కమల్ హాసన్ తో నటించడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆయనతో నటించాలనే నా కోరిక నిజమైంది” అని ప్రభాస్ పేర్కొన్నారు. కాగా, ఈ మూవీని మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News