Sunday, December 22, 2024

36 సంవత్సరాల తర్వాత…

- Advertisement -
- Advertisement -

ఉలగనాయగన్ కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం 1987లో విడుదలైన వారి కల్ట్ యాక్షన్ డ్రామా ‘నాయకుడు’ తర్వాత మళ్లీ కలిశారు. 36 సంవత్సరాల తర్వాత లెజెండ్స్ ఇద్దరు ‘కెహెచ్ 234’ కోసం తిరిగి జతకట్టారు. ఈ సినిమా శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘బిగిన్ ది బిగిన్’ అనే ప్రోమోలో కమల్ హాసన్, ప్రదీప్ శక్తి మధ్య నాయకన్ ఐకానిక్ సీక్వెన్స్ చూపించారు.

ఇది చిత్రం గ్రాండ్ లాంచింగ్ వేడుక విజువల్స్ కూడా చూపిస్తుంది. కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు తమ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇద్దరు లెజెండ్స్ కమల్ హాసన్, మణిరత్నంల మ్యాజికల్ కాంబినేషన్ కి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News