Friday, November 22, 2024

రజినీకాంత్‌తో కమల్‌హాసన్ భేటీ

- Advertisement -
- Advertisement -

Kamal haasan meets with Rajinikanth

 

మద్దతు కోరే అవకాశం..?

చెన్నై: మక్కల్‌నీది మయ్యమ్(ఎంఎన్‌ఎం) వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ శనివారం మరో సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో భేటీ అయ్యారు. కాగా, వారిద్దరిమధ్యా రాజకీయ చర్చలు జరగలేదని సన్నిహితులు తెలిపారు. కొన్ని వారాల క్రితమే రజినీకాంత్ తానిపుడు రాజకీయ పార్టీ పెట్టడంలేదని స్పష్టం చేశారు. గత నెల రక్తపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న అనంతరం తన అభిమానులకు ఈ విషయమై స్పష్టతనిచ్చారు. నూతన సంవత్సరం తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానని గతేడాది డిసెంబర్‌లో రజినీకాంత్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులు ఆందోళన చెందడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. రజినీ రాజకీయాల్లోకి రానని తెలపడంతో ఆయన మద్దతును తన పార్టీకి ఇవ్వాలని కమల్ కోరనున్నట్టు భావిస్తున్నారు. ఏప్రిల్‌మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News