Monday, December 23, 2024

పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు రాకూడదు : కమల్‌ హాసన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దాదాపు 20 విపక్షాలు పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ రాష్ట్రపతి ఎందుకు ఈ కార్యక్రమానికి రాకూదడు ? అని ప్రధాని మోడీని సూటిగా ప్రశ్నించారు. “ దేశానికి గర్వకారణమైన ఈ సమయంలో రాజకీయ విభేదాలు తలెత్తాయి. అందుకే ప్రధాని మోడీని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను.

దయచేసి దేశానికి చెప్పండి. ఎందుకు దేశాధ్యక్షురాలు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాకూడదు ? దీనికి కారణం ఏమీ కనిపించడం లేదు. ఇంతటి చారిత్రక ఘట్టంలో దేశానికి అధినేతగా రాష్ట్రపతి పాల్గొంటే బాగుండేదని, కానీ తనను ఆహ్వానించకూడదనడానికి తనకైతే సరైన కారణమేదీ కనిపించడం లేదు” అని కమల్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News