Monday, December 23, 2024

400కి పైగా థియేటర్లలో ‘విక్రమ్’

- Advertisement -
- Advertisement -

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్‌ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. జూన్ 3న విడుదల కానున్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో సూర్య పవర్‌ఫుల్ గెస్ట్ రోల్‌లో అలరించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 400కి పైగా థియేటర్లలో ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. ఇదిలావుండగా నితిన్ తండ్రి నిర్మాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, కమల్ హాసన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా ‘విక్రమ్’ తెలుగు పోస్టర్‌ను కమల్ హాసన్‌కి అందించారు. ఇక కమల్ హాసన్, చిత్ర యూనిట్‌తో తెలుగులో గ్రాండ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు.

Kamal Haasan’s Vikram to release on June 3rd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News