Sunday, January 19, 2025

అమిత్‌షా వ్యాఖ్యలపై స్పందించిన కమల్‌హాసన్

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా నటుడు, మక్కల్ నీది మయమ్ పార్టీ నేత కమల్‌హాసన్ దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆలోచనలతోనే భారత దేశం నిర్మితమైందన్నారు. ‘ గాంధీజీ విదేశీయుల అణచివేత నుంచి భారత్‌కు విముక్తి కల్పిస్తే… అంబేద్కర్ దేశం లోని సామాజిక అన్యాయాల నుంచి విముక్తి కల్పించేందుకు కృషి చేశారు. అంబేద్కర్ దృక్పథాన్ని ప్రతి భారతీయుడు నమ్ముతున్నారు. దానిపై ప్రతి ఒక్కరూ పోరాడతారు. అలాంటి గొప్ప వ్యక్తి వారసత్వాన్ని చెరిపేయాలని చూస్తే ఎవరూ సహించరు. మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలైన సందర్భంగా పార్లమెంట్‌లో దానిపై అర్థవంతమైన చర్చలు జరపాలి. అదే విధంగా అంబేద్కర్ ఆలోచనలను కూడా చర్చించుకోవాలి ” అని పేర్కొన్నారు.

తమిళనటుడు విజయ్ కౌంటర్
కొంతమందికి అంబేద్కర్ పేరంటే గిట్టదు. అంబేద్కర్ పేరు వినడమే నచ్చదు. ఆయన భారత్ పౌరులందరికీ స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేథావి. ఆయన అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి. సామాజిక న్యాయానికి ప్రతీక. అంబేద్కర్. అంబేద్కర్ అని ఆయన పేరు అంటే మనసు, పెదవులకు సంతోషంగా ఉంటుంది ” అని తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షులు విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దళపతిగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News