Wednesday, January 22, 2025

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సిఎం అభ్యరిగా కమల్‌నాథ్…

- Advertisement -
- Advertisement -

“జన్ ఆక్రోష్ యాత్ర”లో ప్రకటించిన రాహుల్ గాంధీ

భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగానే ప్రకటించింది. భోపాల్ లోని షాజపూర్‌లో శనివారం నాడు జరిగిన కాంగ్రెస్ “జన్ ఆక్రోష్ యాత్ర” లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌నాథ్ పేరును అధికారికంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

దీంతో సభావేదికపై ఉన్నకమల్‌నాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అంతలోనే తెప్పరిల్లి సంతోషంతో సభికులకు, వేదికపై ఉన్న అందరికీ అభివాదం చేశారు. కమల్‌నాథ్ రాష్ట్రానికి చేసిన సేవలను రాహుల్ ప్రశంసించారు. రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని , తన హయంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ ఆయన పూర్తి చేస్తారని రాహుల్ భరోసా ఇచ్చారు. కమల్‌నాథ్‌కు పోటీ ఎవరూ మధ్యప్రదేశ్‌లో లేరని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు.

దేశం లోనే అవినీతికి కేంద్ర స్థానంగా మధ్యప్రదేశ్ నిలుస్తోందని శివరాజ్‌సింగ్ చౌహాన్ హయాం లోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఈ పోరాటం కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీల మధ్య సిద్ధాంతాల పోరని, ఒకవైపు మహాత్మాగాంధీ ఉన్నారని, మరోవైపు గాడ్సే ఉన్నారని పరోక్షంగా బీజేపీని తప్పు పట్టారు. బీజేపీ ఎక్కడకు వెళ్లినా విద్వేషాలను ప్రోత్సహిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రేమ, గౌరవం సౌభ్రాతృత్వానికి పాటుపడుతుందని , పేదలు, రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు. ఒబీసీలను ప్రధాని మోడీ వంచించారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News