Tuesday, November 5, 2024

చింద్వారా నుంచి కమల్‌నాథ్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

చింద్వారా: మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ గురువారం మధ్యాహ్నం తన సొంత నియోజకవర్గమైన చింద్వారాలో నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని రామాలయంలో పూజలు జరిపిన అనంతరం ఆయన ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కమల్‌నాథ్ విలేఖరులతో మాట్లాడుతూ మధ్యప్రదేశ్, చింద్వారా ప్రజలు కాంగ్రెస్‌పై, తనపై తమ ఆశీస్సులను కురిపిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కమల్‌నాథ్ లోక్‌సభలో ఎనిమిదిసార్లు చింద్వారా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

2018లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన చింద్వారా ఎంఎల్‌ఎ దీపక్ సక్సేనా రాజీనామా చేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. అయితే జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో పలువురు ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో ఆయన ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News